రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే ఈరోజు డైరెక్టర్ క్రిష్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తన వ్యక్తిగత కారణాలు, సినిమా షూటింగ్స్ వల్ల ముంబైలో ఉన్నానని, శుక్రవారం ఉదయం విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
కాగా శుక్రవారం విచారణకు రావాల్సిందిగా నిన్న మధ్యాహ్నం పోలీసులు క్రిష్‌కు సమాచారమిచ్చారు. అయితే మరో రెండు రోజులు సమయం కావాలని ఆయన పోలీసులను కోరారు. దీంతో క్రిష్ విజ్ఞప్తిని పోలీసులు నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
ఈలోగా తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశముంది. కాగా పోలీసుల ఆదేశాల ప్రకారం ఈరోజు క్రిష్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సస్పెన్షన్ నెలకొంది.