ఐబొమ్మ లో సినిమా చూస్తున్నారా ..? ఈ షాకింగ్ నిజాలు మీకోసమే.

ఐబొమ్మ అనేది సైబర్ నేరగాళ్లు వేసే వల అని కూడా చెప్పుకోవచ్చు. ఐబొమ్మ వెబ్ సైట్ లో సినిమాలు చూస్తే ఒక్కోసారి వైరస్ డౌన్ లోన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల చాలా ఇష్యూలు వస్తాయి. అయినా కూడా జనాలు మాత్రం చూడటం మానేయడం లేదు. థియేటర్ ప్రింట్ లో ఫుల్ మూవీ వెంటనే ఐబొమ్మలో వస్తుంటే ఎందుకు జనాలు చూడరు చెప్పండి. థియేటర్లలోకి జనాలు ఎవరు వెళ్తున్నారు. అయితే ఐబొమ్మ.. పరిచయం అక్కర్లేని పేరిది. మొబైల్ యూజర్స్ ప్రతీ ఒక్కరు ఈ వెబ్ సైట్ కు వెళ్లుంటారు. ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతీ సినిమాను అంతే క్వాలిటీలో ఫ్రీగా తమ ప్రేక్షకులకు అందిస్తుంది.

దాంతో చాలామంది ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం మానేసి.. ఫ్రీగా దొరికే ఐబొమ్మ బాట పడుతున్నారు. దీనివల్ల చాలామంది నిర్మాతలు నష్టాల్లో పడిపోతున్నారు. ఈ వెబ్ సైట్ ను ప్రభుత్వం ఎన్నిసార్లు బ్లాక్ చేసినా.. కొత్త డొమైన్ తీసుకుని మళ్లీ అదే పేరుతో కొత్త వెబ్ సైట్ ను నడుపుతున్నారు. ఇలాంటి వెబ్ సైట్స్ నడిపించే వాళ్లంతా దాదాపు విదేశాలనుంచి పనిచేస్తారని, వాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదని నిఘా వర్గాలు చెప్తుంటాయి. అయితే, తాజాగా ప్రభుత్వం ఇందులో సినిమాలు చూడటాన్ని నిషేదించింది. వెబ్ సైట్ ఓపెన్ అవుతున్నా.. సినిమాలు చూడటం కుదరట్లేదు.

ఈ క్రమంలో చాలామంది వీపీఎన్ లు వాడి ఐబొమ్మలో సినిమాలు చూస్తున్నారు. దీనివల్ల యూజర్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వీసీఎన్ వాడి సినిమాలు చూసేటప్పుడు మన ప్రమేయం లేకుండా చాలా యాడ్స్ ఓపెన్ అవుతుంటాయి. వాటినుంచి బయటికి రావాలన్నా అప్పుడప్పుడు సాధ్య కాదు. దీనివల్ల కొత్త కొత్త వైరస్ లు ఫోన్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అవి ఫోన్ ను పాడు చేయడమే కాకుండా.. వ్యక్తిగత డేటాను దొంగలించే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *