ప్రముఖ నటి దివ్య స్పందన మృతిచెందారా..? అసలు విషయం ఇదే.

సోషల్ మీడియా పుణ్యమా అని దర్జాగా బ్రతికి ఉన్న సెలెబ్రిటీలను చంపేస్తున్నారు. చాలా సార్లు ప్రముఖ పొలిటికల్ లీడర్స్, సినీ సెలెబ్రిటీస్, వ్యాపారవేత్తలు ఇలా ఎందరి విషయంలోనే బ్రతికి ఉండగానే మరణించినట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. తాజాగా కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన గుండెపోటుతో మృతి చెందినట్లు జాతీయ మీడియా గుర్తించింది. అసలు విషయమేంటంటే..! తాజాగా కన్నడ నటి మరియు రాజకీయ నాయకురాలు అయిన దివ్య స్పందన ఈ ఉదయమే గుండెపోటుతో మరణించినట్లు వార్త సోషల్ మీడియాలో వచ్చింది. ఈ వార్త నిజం అనుకుని అభిమానులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు చాలా బాధతో ఉండగా..

అసలు ఏమి జరిగిందని తెలుసుకోవడానికి దివ్య స్పందన ఫ్రెండ్స్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి శుభవార్తను అందించారు.వీరు మాట్లాడుతూ.. మేము ఇప్పుడు స్విజ్జర్లాండ్ లో ఉన్న దివ్య స్పందన తో మాట్లాడమని .. ఆమె సజీవంగానే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక బెంగుళూరు కు చెందిన దివ్య స్పందన సూర్య సన్ అఫ్ కృష్ణన్ మరియు అభిమానాయు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *