విడాకులపై కలర్స్ స్వాతి రియాక్షన్..! ఒక్క మాటతో తేల్చేసిన హీరోయిన్.

మీడియా సమావేశంలో ఇటీవల మీరు డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కదా.. వీటిపై మీ సమాధానమేంటీ అని అడగ్గా దీనికి స్వాతి స్పందిస్తూ.. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. చెప్పను అంటూ సూటిగా చెప్పేసింది. అలాగే స్వాతి మాట్లాడుతూ.. కలర్స్ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో నాకు కేవలం పదహారేళ్లు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. నన్ను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో కూడా తెలియదు. ఒకవేళ అప్పుడు సోషల్ మీడియా ఉంటే నన్ను ఫుట్ బాల్ ఆడేసేవారేమో అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ‘కలర్స్’ స్వాతి వివాహం 2018లో జరిగింది. వికాస్ వాసుతో ఆమె ఏడు అడుగులు వేశారు. సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలను కలర్స్ స్వాతి ఎప్పుడూ చెప్పింది లేదు. వివాహమైన తర్వాత విదేశాలు వెళ్ళాక… రెండు మూడుసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే… భర్త నుంచి స్వాతి విడాకులు తీసుకున్నారని, అందువల్ల మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ‘కలర్స్’ స్వాతి ప్రధాన పాత్రలో గత ఏడాది ‘పంచతంత్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ఏడాది ‘మంత్ ఆఫ్ మధు’ విడుదల కానుంది. ఆ సినిమాలో నవీన్ చంద్రకు జోడీగా ఆమె నటించారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమంలో విడాకులకు సంబంధించిన ప్రశ్న స్వాతికి ఎదురైంది. ”ఈ కార్యక్రమానికి, ఆ ప్రశ్నకు సంబంధం లేదు. అనవసరం అని నా అభిప్రాయం. నేను సమాధానం చెప్పను” అని స్వాతి స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆన్సర్ వైరల్ అవుతోంది. ప్రశ్న అడిగిన విలేకరిపై కొందరు విమర్శలు చేస్తున్నారు కూడా! ఆ విధంగా అడగటం సభ్యత కాదని ఆయనకు హితవు పలుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *