నటి హరితేజ చేసిన కామెడీ రోల్స్.. క్యామియో రోల్స్ సినిమాల్లో బాగా వర్కౌట్ అయ్యింది. ఇక అదేక్రేజ్ తో మరో రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో ఫస్ట్ సీజన్ లో అవకాశం సాధించింది. బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చి మరింత ఫేమస్ అయ్యింది హరితేజ. అయితే తెలుగు ప్రేక్షకులకు నటి హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన హరితేజ, సీరియల్ నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలే చేసి మెప్పించింది.
ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చి మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క మంచి సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ఇక 2015 లో హరితేజ, దీపక్ అనే వ్యక్తిని వివాహమాడింది. వీరికి భూమి అనే కూతురు కూడా ఉంది. ఇక బిడ్డ పుట్టాకా హరితేజ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. దీంతో ఆమె కష్టపడి బరువు తగ్గి.. నాజూగ్గా తయారయ్యింది. ఇక అప్పటినుంచి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తుంది.
ఇక ప్రస్తుతం ఈ భామ.. ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తుంది. కూతురును తన తల్లి దగ్గర వదిలి.. సింగిల్ గా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో ముచ్చటించింది. చిట్ చాట్ సెషన్ ప్రారంభించింది. అందులో ఒక నెటిజన్.. భర్త దీపక్ తో విడాకులు తీసుకున్నారా.. ? అన్న ప్రశ్నకు హరితేజ.. ” నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే..” అంటూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ విడాకుల న్యూస్ నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.