విడాకులకు రెడీ అవుతున్న కలర్స్ స్వాతి. ఎలా తెలిసిందో తెలిస్తే..?

సుమారు రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే విధంగా స్వాతి విడాకులు తీసుకుంటోందన్న వార్త హల్‌చల్ చేసింది. అప్పట్లో స్వాతి అకస్మాత్తుగా తన భర్త ఫొటోలు తొలగించడంతో కలకలం రేగింది. దీంతో, ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే సమంత తన పేరు నుండి అక్కినేని అనే ఇంటి పేరు తొలగించింది. దాంతో నాగ చైతన్యతో విడాకుల వార్తలకు బీజం పడింది.

కథనాలు మొదలైన కొన్ని నెలల తర్వాత అధికారికంగా ప్రకటించారు. నిహారిక సైతం ఇదే ట్రెండ్ ఫాలో అయ్యింది. అయితే నిహారిక కంటే ముందు భర్త వెంకట చైతన్య హింట్ ఇచ్చాడు. వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు. అనంతరం కొద్ది రోజులకు నిహారిక కూడా డిలీట్ చేసింది. విడాకుల ఊహాగానాలు మధ్య ఇటీవల అధికారిక సమాచారం అందింది. వాళ్ళు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేసుకున్నారు. అలాగే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా ఇంస్టాగ్రామ్ నుండి భర్త కళ్యాణ్ దేవ్ పేరు తీసేసారు.

ప్రస్తుతం వారు విడివిడిగా ఉంటున్నారు. ఇదే తరహాలో కలర్స్ స్వాతి విడాకులపై హింట్ ఇచ్చారనే ప్రచారం మొదలైంది. స్వాతి ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు భర్తతో విబేధాలు తలెత్తాయని చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. స్వాతి 2018లో తన ప్రియుడు వికాస్ వాసును పెళ్లి చేసుకుంది. వికాస్ వాసు పైలట్ కాగా వివాహం అనంతరం విదేశాల్లో సెటిల్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *