హీరో గోపీచంద్‌ను బండ బూతులు తిట్టిన డైరెక్ట‌ర్‌. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం రాజ్ తరుణ్ ని హీరోగా తీసుకొని డైరెక్ట్ చేసిన ‘తిరగబడరా స్వామి’ సినిమా లో హీరోయిన్ ను బాలయ్య కు ఫ్యాన్ గా చూపించాడు. రవి కుమార్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లను డైరెక్ట్ చేసాడు. అయితే గోపీచంద్‌తో యజ్ఞం,సౌఖ్యం… సాయి ధరమ్‌తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం.. బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాలకు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించారు. సుమారు పదేళ్ల తర్వాత రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరాసామీ’ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు.

తాజాగ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హీరో గోపీచంద్‌పై ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు ఇలా చేశాడు. గతంలో అందరం చెట్టు కింద కూర్చోని భోజనం చేసేవాళ్లం.. ఒకరోజు అతని కోసం వెళ్తే కొంతసేపు వెయిట్‌చేయమను అన్నాడు అని గోపీచంద్‌ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఇలా విమర్శలు చేశాడు. ‘ఒరేయ్‌ అంత బలిసిందా రా మీకు..? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్‌.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారుగురిని దాటుకుని రావాల్నా.. వాడిని హీరోగా నేనే చేశాను (యజ్ఞం). అప్పటివరకు వాడు విలన్‌గా నటించేవాడు (జయం,నిజం,వర్షం). నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్‌ కంటే వాడికి తక్కువ.

అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.. వాడు ఇప్పుడు ఎదరుపడినా ఇలానే మాట్లాడుతాను. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు నేడు పూర్తిగా మారిపోయాడు. 2016 సంవత్సరంలో కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ‘రారాజు’ సినిమా షూటింగ్‌​ జరుగుతుంది. ఆ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో వీరభద్ర సినిమా తీసి ప్లాప్‌లో ఉన్నాను. ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగిన నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఇదంతా జరిగిన సమయంలో ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కూడా అక్కడే ఉన్నారు.’ అని ఆయన పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *