సీనియర్ జర్నలిస్ట్ , సినీ దర్శకుడు కె.జయదేవ్ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి గుండె పోటుతో హైదరాబాద్ లో ఆయన చనిపోయారు. జయదేవ్ దర్శకత్వం వహించిన “కోరంగి నుంచి” చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలన చిత్రాభివృద్ది సంస్థ నిర్మించింది. అయితే వరుస విషాదాలు వెంటాడుతున్న చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కే జయదేవ్ కన్నుమూశారు.
సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. జయదేవ్ డైరెక్ట్ చేసిన ‘కోరంగి నుంచి’ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలన చిత్రాభివృద్ది సంస్థ నిర్మించింది. 2022లో తీసిన ఈ సినిమాను పలు జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. దర్శకుడు, జరలిస్టు కేఎన్‌టీ శాస్త్రి కుమారుడే జయదేవ్. ఉత్తమ సినీ విమర్శకుడిగా కేఎన్‌టీ శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు.
12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. జయదేవ్ కు భార్య యశోద, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయదేవ్ మృతితో టాలీవుడ్ శోఖ సంద్రంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు జయదేవ్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్ ఇంట్లోనూ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని అవినాష్ దంపతులు భావించారు.