పక్షవాతంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో ఆయనకు ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. అయితే చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ పక్షవాతంతో నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 77. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు.
1976లో స్వప్నదానం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కేజీ జార్జ్. ఇక మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక 2015లో మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం జైసీ డేనియల్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ఆ తరువాత ఆయన ఒక ఫిలిం స్కూల్ ను కూడా స్థాపించారు.
అందులో నుంచి బయటకు వచ్చిన చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప నటులు అయ్యారు కూడా. ఇక కేజీ జార్జ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆయన ఓల్డేజ్ హోమ్ లో ఉండడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఇక ఆయన మరణవార్త విన్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తరలిస్తున్నారా.. ? లేక ఓల్డేజ్ హోమ్ లోనే ఉంచుతారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.