ఆ సినిమాను అందుకే హిట్ కాలేదన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్.

హనుమాన్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అంతేకాకుండా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హనుమాన్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది.

ఈ వేడుకలో చిత్ర యూనిట్‌కు హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు మేకర్స్. “50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది హనుమాన్ సినిమాకి జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్ ఇలా చాలా మంది జీవితాలని మారుస్తుంది.

అది సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. హనుమాన్ లాంటి సినిమా 50 రోజులు 150 థియేటర్స్‌లో నడిచిందనేది చాలా మందికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం” అని ప్రశాంత్ వర్మ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *