గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది డింపుల్ హయతి. 2017లో వచ్చిన గల్ఫ్ సినిమాలో నటించింది డింపుల్. ఆతర్వాత యురేక అనే సినిమాలో నటించింది ఈ చిన్నది. అలాగే అభినేత్రి 2 లో నటించింది డింపుల్.
కానీ గద్దల కొండ గణేష్ సినిమాతో పాపులర్ అయ్యింది. సామాన్యుడు, ఖిలాడి, రామబాణం సినిమాల్లో నటించింది డింపుల్ హయతి. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేక పోయింది డింపుల్. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.
అందాల ఆరబోతలోనూ ఈ చిన్నది ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి.