సంక్రాంతి కానుకగా శుక్రవారం భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.గుంటూరు కారం ఫక్తు కమర్షియల్ హంగులతో రూపొందిన మాస్ మసాలా ఎంటర్‌టైనర్.
మహేష్ నుంచి అభిమానులు కోరుకునే ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, మాస్ స్టెప్పులు అన్ని ఉండేలా చూసుకుంటూ తనదైన శైలి సెంటిమెంట్స్, కామెడీతో దర్శకుడు త్రివిక్రమ్ గుంటూరు కారం కథను రాసుకున్నాడు. కమర్షియల్ హంగుల విషయంలో సక్సెస్ అయిన త్రివిక్రమ్ అసలు కథ విషయంలో తప్పటడుగులు వేశారు.
చిన్నతనంలోనే తల్లికి కొడుకు దూరం కావడం, పాతికేళ్ల తర్వాత ఆమెను కలవడం అనే పాయింట్‌తో అలా వైకుంఠపురములో. అత్తారింటికి దారేదితో పాటు అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు. అదే పాయింట్‌ను కాస్త అటూ ఇటా మార్చి పొలిటికల్ అంశాలను టచ్ చేస్తూ గుంటూరు బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే మనసుల్ని కదిలించే ఫ్యామిలీ ఎమోషన్స్. అతడి మార్క్ పంచ్‌లు, ప్రాసలు సినిమాలో మిస్సయ్యాయి.