చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపించే దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో మాత్రం మసాలా సమోసాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిచెడగొడుతోంది. అమ్మడి బోల్డ్ లుక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రకృతిలో పరశించిపోతూ స్మైలీ లుక్స్‌తో ఫోటోషూట్ చేసింది దీప్తి సునైనా. దీప్తి సునైనా నువ్ హీరోయిన్‌గా ట్రై చేస్తే చాలా ఆఫర్లు వస్తాయని సలహా ఇస్తున్నారు.
ఇంకొక నెటిజన్ అయితే అందానికి నువ్వే గుర్తు అంటూ నీ డ్రెస్సింగ్ స్టైల్ మెచ్చుకునే విధంగా ఉంటుందని కితాబిస్తున్నారు. అయితే అందం, ఆకర్షణ, అభినయం దీప్తి సునైనా సొంతం. కానీ ఈ అమ్మడు సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అందుకోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. టిక్ టాక్ అందుబాటులోకి రాని సమయంలోనే డబ్స్ బ్యాచ్ ద్వారా ఫేమస్ అయిన ఈమె ఆ తరువాత టిక్ టాక్ వీడియోలు చేసి ఆకట్టుకుంది.
ఈ యాప్ బ్యాన్ అయిన తరువాత షార్ట్ వీడియోస్ తో అలరిస్తోంది. షార్ట్ వీడియోల్లో దీప్తీ డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది.ఇలా చాలా వీడియోలు చేసిన తరువాత ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆమకు వెబ్ సీరీసుల్లో నటించే అవకాశం వచ్చింది. వీటితో దీప్తి మరింత క్రేజ్ సంపాదించుకుంది.