దీప్తి హత్య కేసు వివరాలను జగిత్యాల ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కోరుట్లకు చెందిన బంక చందన 2019లో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కాలేజీలో బీటెక్ జాయిన్ అయింది. ఉమర్ షేక్ సుల్తాన్(25) అనే యువకుడు చందనకు వన్ ఇయర్ సీనియర్. చందన రెండేండ్లు డిటెయిన్డ్ అయింది. ఉమర్ వన్ ఇయర్ డిటెయిన్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు క్లాస్‌మేట్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని ఎస్పీ పేర్కొన్నారు.
అయితే కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మర్డర్ మిస్టరీ వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు. చంపింది చెల్లెనే అని, చున్నీతో గొంతు నులిమి చంపారని ఆయన తెలిపారు. ఉమర్ షేక్ సుల్తాన్‌తో చందన ప్రేమలో ఉందని, చందనతో పెళ్లికి ఉమర్ షేక్ తొలుత నిరాకరించాడని తెలిసింది. ఉమర్‌ను కోరుట్ల రమ్మని చందనే కోరిందని, దీప్తి, చందన ఇద్దరూ మద్యం తాగేలా ప్లాన్ చేసి.. చందన, ఉమర్ డబ్బు, నగదుతో పారిపోవాలని చూశారని జగిత్యాల ఎస్పీ భాస్కర్ వివరించారు.
చందన బయటకు వెళ్లే సమయంలో దీప్తి నిద్ర లేచిందని, దీంతో దీప్తిని చున్నీతో ఇద్దరు కలిసి చంపేశారని చెప్పారు. ఈ హత్యలో ఏ1 చందన, ఏ2 సుల్తాన్, ఏ3 సుల్తాన్ తల్లి సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీప్తి కేసుని ఛేదించేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశామని, కేసు ఛేదనలో సాంకేతికత ఉపయోగ పడిందని చెప్పారు. ఆర్మూర్ దగ్గర చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ దొరికాడని జగిత్యాల ఎస్పీ చెప్పారు.