కాలి నడకన తిరుమల కొండ ఎక్కిన దీపికా పదుకునే, మెట్లు ఎక్కుతున్న సమయంలో..?

నడక మార్గంలో వస్తున్న దీపికా పదుకొనెతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. మరోవైపు తిరుమలకు చేరుకున్న తర్వాత రాధేయం అతిధి గృహానికి దీపికా పదుకొనె చేరుకున్నారు. అయితే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అందులో స్టార్స్, సెలబ్రిటీలు కూడా ఉంటారు. అయితే ఎక్కువ శాతం సెలబ్రెటీలు మరియు స్టార్స్ డైరెక్ట్ కొండపైకి వెయికిల్‌ లో వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వెళ్లి పోతారు.

కానీ కొద్ది మంది మాత్రమే కాలి నడకన కొండ ఎక్కుతారు. సామాన్య భక్తుల మాదిరిగా స్వామి వారిని దర్శించుకునేందుకు కాలి నడకన కొండ ఎక్కిన సెలబ్రెటీల జాబితాలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొనె చేరారు. ఆమె గురువారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా దాదాపు మూడున్నర గంటల పాటు కాలినడకన కొండ ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం టీటీడీ సిబ్బంది దగ్గర ఉండి ఆమెకు చేయించారు. ఆమె శ్రీ వారిని దర్శించుకున్న తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారని సమాచారం అందుతోంది.

అలిపిరి మార్గంలో కాలి నడకన ఆమె మెట్లు ఎక్కుతున్న సమయంలో భక్తులు చాలా మంది ఆమెను గుర్తు పట్టి సెల్ఫీలు తీసుకున్నారు. భద్రత సిబ్బంది మరియు వ్యక్తిగత సహాయకురాలితో కలిసి దీపికా కొండ పైకి కాలి నడకన ఎక్కారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా లో దీపికా పదుకునే కాలి నడకన శ్రీవారి కొండ మెట్లు ఎక్కుతున్న ఫోటోలు మరియు వీడియో లు వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *