సహజ మరణం పొందిన వారి ఆత్మ పరమాత్మ సన్నిధి లో ఐక్యమవుతుంది. కానీ ప్రమాదాల వల్ల మరణించిన వారి ఆత్మ దైవ సన్నిధికి చేర లేక భూలోకంలో రాలేక, వారికి తీరని ఆంక్షలు ఉండటం వల్ల కొట్టుమిట్టాడుతుంది అని అంటారు. ఇది ఇలా ఉంటె పురాణాల ప్రకారం సహజమైన మరణం వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు ముందు గానే కనిపిస్తాయని తెలుస్తోంది. అయితే గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు, అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడటం ప్రారంభిస్తాడు.
పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి చనిపోయే ముందు, అతను ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టమవుతుంది. ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడాన్ని చూస్తారు, మరికొందరు ఆ తలుపు నుంచి మంటలు రావడం చూస్తారు.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే, ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. జీవితం చివరి క్షణాలలో, ఒక వ్యక్తి తనకు పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు, ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు. ఒక వ్యక్తి తన చుట్టూ యమ దూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు, అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం. అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది.