ఈ సృష్టిలో ఖర్జూరాలు మన అదృష్టం కొద్దీ పుట్టిన ఫలాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి తియ్యగా ఉండటమే కాదు… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. అవి మన శరీరానికీ, బ్రెయిన్‌కీ ఎంతో మేలు చేస్తున్నాయి. ఖర్జూరాల్లో విటమిన్ బీ6 ఉంటుంది. అది బ్రెయిన్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలోని సెరోటోనిన్… మన మూడ్‌ని సరిచేస్తుంది. ఖర్జూరాల్లోని నోరెపిన్‌ఫ్రైన్… మనలోని ఒత్తడి, టెన్షన్లను తగ్గిస్తుంది. విటమిన్ బీ6 తక్కువగా ఉన్నవారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. టెన్షన్ తగ్గినప్పుడే మన మూడ్ బాగుంటుంది. అప్పుడు మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మనలో అందరికీ తెలుసు.
శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూరంలో ఉన్నాయి. ఇందులో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గుతారు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు నిద్ర నుంచి లేచిన తర్వాత తప్పనిసరిగా ఖర్జూరాన్ని తినాలి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఆకలిని కలిగించదు. ఎనర్జీ పెరుగుతుంది.. రోజూ ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే, రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది. నిజానికి, ఈ తీపి పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా మీలోనూ శక్తిని నింపుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. కడుపు రుగ్మతలతో బాధపడేవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖర్జూరం తినాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ, పేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. తీపి తినాలనే కోరికలు తగ్గుతాయి.. చాలా మందికి స్వీట్స్ తినాలనే కోరిక ఉంటుంది. స్వీట్స్ ఎక్కువగా తింటే ఊబకాయం, మధుమేహం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. తీపి తినాలనే కోరికలు తగ్గించుకోవడానికి ఖర్జూరాలు మీకు బెస్ట్ ఆప్షన్. ఇది తీపి కోరికలను తగ్గిస్తుంది.