శ్రీలీల ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో వరుస షూటింగ్స్ తో, ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే మరోపక్క మెడిసిన్ చదువుకుంటుంది. అయితే ఇన్ని సినిమాల మధ్య చదువు ఎలా కుదురుతుందనే ప్రశ్నకు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది శ్రీలీల. ‘మనిషి ఏదైనా ఒకే పని చేస్తూ పోతే ఒక దశలో విసుగు వచ్చేస్తుంది. డిఫరెంట్ పనులు చేస్తూ వుండాలి.
నా వరకూ సినిమాలు, మెడిసిన్ వేరు వేరు. ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. అదే సమయంలో దేనికవే ప్రత్యేకం. ఒక సినిమాకి డేట్స్ ఇచ్చే ముందే చదివే టైంని ఎలా బ్యాలెన్స్ చేసులోవాలో ఒక అవగాహన వుంటుంది’ అని చెప్పుకొచ్చింది. ‘అంతేకాదు నిజానికి మనం ఇప్పుడు చేస్తున్న పని తక్కువే.
ఒకప్పుడు ఎలాంటి వసతులు లేకుండానే ఏడాది పది సినిమాలు చేసిన నటులు వున్నారు. ఇప్పుడన్నీ మన చేతిలో వున్నాయి. ప్రపంచంలో ఎక్కడికైనా ఒక విషయాన్ని కమ్యునికేట్ చేయాలంటే ఒక్క ఫోన్ కాల్‌తో అయిపొయింది. పైగా ఒక రోజు మొత్తం పని చేసినా రాత్రికి ఖచ్చితంగా ఇంటికి వెళ్తాం. చదువుకోవాలనే ఆసక్తి ఉండాలే కానీ ఆ సమయం సరిపోతుంది’ అని తన మనులో మాట పంచుకుంది శ్రీలీల.