‘అందరూ ఆరోగ్యంతో, ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్ చూసి మీరందరూ గందరగోళానికి గురవుతారని తెలుసు. నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి సమాచార విషయాలని పంచుకునేందుకు ఉన్నాయి. అయితే అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘హలో అందరికీ.. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్ చూసి మీరందరూ ఎంతో గందరగోళానికి గురై ఉంటారు.
ఇకపోతే నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి సమాచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవడానికి, ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి, జీవన విధానాలను, సాంప్రదాయాలను, సంతోషాలను షేర్ చేసుకునేందుకే సోషల్ మీడియా ఉంది. సంతోషాన్ని షేర్ చేసుకున్నా.. ఇప్పుడు బాధను..ఈ పోస్ట్ ఎందుకు వేశానంటే.. నేను ఏ ఫోటోషూట్ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్ చేసినా, నవ్వుకున్నా, కౌంటర్స్ ఇచ్చినా.. ఏం చేసినా మీతో షేర్ చేసుకున్నాను.
ఎందుకంటే అవన్నీ నా జీవితంలో భాగమే.. నా జీవితంలో బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేను బలహీనమైపోయి, కుమిలిపోయి ఏడ్చాను. దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్‌లో ఇటువంటి రోజులు కూడా ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకున్నాను.