చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో మొన్న శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ లపై అనుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు భావించారు.అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం తీర్పు అనుకూలంగా వస్తుందని అంచనా వేశారు. కానీ షాక్ తప్పలేదు. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి బెయిల్, కస్టడీ పిటిషన్‌లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.
స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. అదేవిధంగా కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వలేమని పేర్కొంది. ఇప్పటి వరకు బాబుకు కేసులో కాస్తో, కూస్తో ఊరట లభిస్తుందని ఎదురుచూసినప్పటికి నిరాశే ఎదురైంది.

ఇదిలా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో నలుగురు పేర్లు చేర్చింది సీఐడీ. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణిశంకర్, రావూరి సాంబశివరావును నిందితులుగా చేరుస్తూ సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.