నటి జోసెఫిన్ చాప్లిన్ మరణించారని వారి కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆమె వయస్సు 74. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం.. జూలై 13న పారిస్‌లో మరణించారని పేర్కొన్నారు. ఆమె మృతి వెనుక కారణం ఇంకా వారు వెల్లడించలేదు. సుమారు 10రోజులు క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారని తెలియాల్సి ఉంది.
అయితే ప్రపంచ దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కూతురు నటి జోసెఫిన్ చాప్లిన్ కన్ను మూసింది. వృద్దాప్య సమస్యలతో జోసెఫిన్ చాప్లిన్ మరణించినట్లు తెలుస్తుంది. 74ఏళ్లున్న జోసెఫిన్ చాప్లిన్ ప్యారిస్‌లో జూలై 13న తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తాజాగా ప్రకటించారు. చార్లీ చాప్లిన్ 8మంది సంతానంలో జోసెఫిన్ చాప్లిన్ మూడో బిడ్డ. ఇక జోసెఫిన్ చాప్లిన్ కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో 1949న జన్మించింది.

మూడేళ్ల వయసులోనే తండ్రి చార్లీ చాప్లిన్‌తో కలిసి లైమ్‌లైట్ అనే సినిమా కోసం జోసెఫిన్ తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఆ తర్వాత నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ది కాంటర్ బరీ, డౌన్ టౌన్, ది బేయ్ వంటి పలు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక జోసెఫిన్‌కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆమె మరణ వార్త తెలిసి ప్రపంచ దిగ్గజ నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె మృతికి హాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.