ఒకప్పుడు సమాజంలో ఒక మగాడు ఆడదానిలా మారాలన్నా లేదా ఒక మహిళ ఒక పురుషుడి లాగా మారాలన్నా కూడా ఎంతో ప్రాసెస్ ఉండేది. ముఖ్యంగా వాళ్లు అలా మారాక కూడా ఎన్నో అవమానాలను ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలిన ఆవాసం లేదు. ఈ ప్రోగ్రాం కు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఈ కామెడీ షో ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
కడుపుబ్బా నవ్వించే టాలెంట్ ఉన్న చాలా మంది ఈ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంతమంది సినిమాల్లోనూ రాణిస్తుంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి వారు హీరోలుగా మారి సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక వేణు దర్శకుడిగా మారి బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తెరకెక్కించాడు. ఇక చాలా మంది పలు సినిమాల్లో కామెడీ రోల్స్ లో కనిపించారు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ లో ఆకట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొంతమంది నిజంగానే అమ్మాయిలుగా మారిపోయారు కూడా.
వీరిలో చెప్పుకోవాల్సింది ప్రియాంక సింగ్ గురించే. ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ లింగ మార్పిడితో పూర్తిగా అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. అంతే కాదు బిగ్ బాస్ గేమ్ షోలో కూడా పాటిస్పెట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా.. ఇక ఇప్పుడు మరో అబ్బాయి కూడా లింగ మార్పిడితో అమ్మాయిగా మారాడని వార్తలు వస్తున్నాయి . అతను ఎవరో కాదు సాయి. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్స్ లో లేడీ గెటప్ తో మెప్పించాడు సాయి. చూడటానికి అచ్చం అమ్మాయిలా ఉండే సాయి. ఇప్పుడు నిజంగానే అమ్మాయిగా మారిపోయాడంటూ టాక్ వినిపిస్తుంది.