చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయ అవసరం ప్రత్యేకంగా లేదనే చెప్పాలి. చిన్నపిల్లల మొదలుకొని పండు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఏకైక మెగాస్టార్ హీరో అని చెప్పవచ్చు.
ముఖ్యంగా నటనలో, డాన్స్ లో ఇతరులకు సహాయం చేయడంలో ఇలా అన్నింటిలో కూడా ముందుండే చిరంజీవి ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన భార్య సురేఖ అంటూ అందరూ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈ జంటకి మంచి గుర్తింపు ఉంది. ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాతే చిరంజీవికి క్రేజ్ పెరిగిందని అందరూ అంటూ ఉంటారు.
దీనిపై సీనియర్ జర్నలిస్టు ఇమ్మంది రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించడం జరిగింది. చిరంజీవికి స్టార్ డం , చరిష్మా రెండు కూడా సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాతే పెరిగాయని, సురేఖ జాతకం చాలా మంచి జాతకం అని ఆయన కామెంట్లు చేశారు. తన భర్త సోదరులను సొంత బిడ్డలా సురేఖ చూసుకున్నారని ఆడపడుచులకు కూడా ఆమె ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని ఇమంది వెల్లడించారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ను సొంత కొడుకులా ఆమె చూసుకున్నారని, పవన్ ఎక్కడ మాట్లాడినా సరే సురేఖను అమ్మ అని అంటారని కూడా ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇక ఎక్కడైనా సరే భార్యకు ఉండే అదృష్టమే భర్తకు వర్తిస్తుంది అని, అది తన అభిప్రాయంగా వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు చరణ్ నా తమ్ముడు అని చెబుతారు అని సురేఖ గారికి పవన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారని కూడా ఇబ్బంది రామారావు తెలిపారు.