చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది.
అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాల మంది సెలెబ్రెటీల కు సంబంధించిన రేర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కు సంబంధించిన ఇప్పటి వరకు ఎవరు చూడని రేర్ ఫోటోలు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయినా చిరంజీవి ఫోటోలలో ప్రస్తుతం ఒక ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
ఆ ఫొటోలో చిరంజీవి కేక్ కట్ చేస్తుంటే పక్కనే ఒక అబ్బాయి ఉన్నాడు.ఆ అబ్బాయి ఎవరు అనేది ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు.ఇంతకూ ఆ అబ్బాయి ఎవరు అని అనుకుంటున్నారా..అవును మీరు గెస్ చేసింది కరెక్ట్..ఆ అబ్బాయి ఎవరో కాదు చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన కంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కేక్ కట్ చేస్తున్న రేర్ ఫోటోను షేర్ చేసారు.ఇక ఈ ఫోటో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.ఇది ఇలా ఉంటె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరియు మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.