వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ లుక్ లో కనిపించి అందరిని అలరించారు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన భోళా శంకర్ మాత్రం పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది. అయితే దాదాపు నాలుగు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. వాల్తేరు వీరయ్య తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు చిరు. చాలా కాలం తర్వాత ఈ లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించి అలరించారు. ఇక ఇటీవలే భోళా శంకర్ తో అడియన్స్ ముందుకు రాగా.. ఈమూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు నెట్టింట చిరు రెమ్యూనరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస లతో అదరగొడుతున్న చిరు.. పారితోషికం విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారట. ప్రస్తుతం చిరు ఒక్కో కు రూ.63 నుంచి 65 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్. ఇటీవల విడుదలైన భోళా శంకర్ కోసం ఆయన దాదాపు రూ. 60 కోట్లు తీసుకున్నారని సమాచారం. అంతకు ముందు ఒక్కో కు చిరు రూ.35 నుంచి రూ.50 కోట్ల వరకు తీసుకనేవారని టాక్.