రామ్ చరణ్ ని రూమ్ లోకి లాక్కెళ్లి బెల్టుతో కొట్టిన చిరంజీవి, ఎందుకో తెలుసా..?

ఆచార్య తర్వాత రామ్ చరణ్, మరోసారి తన తండ్రి చిరంజీవితో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన బుచ్చిబాబు సానాతో ఓ సినిమా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే ఓ సినిమా వస్తోందని టాక్ నడుస్తుండగా.. లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే గత ఏడాది “RRR” తో తిరుగులేని విజయాన్ని అందుకుని ప్రపంచ స్థాయిలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ చిన్ననాటి ఓ సంఘటన తాజాగా బయటపడింది. మేటర్ లోకి వెళ్తే చరణ్ చాలా చిన్నప్పుడు వాళ్ళ డ్రైవర్ వేరే వారిని బూతులు తిడుతూ.. ఉంటే వాటిని వినడం జరిగిందట. ఇంతలో ఇంట్లో హాల్లో కూర్చున్న నాగబాబుని రామ్‌ చరణ్ స్వయాన విన్న అవే బూతు పదాలతో కామెంట్స్ చేయడం జరిగిందట. వెంటనే నాగబాబు.. చరణ్.. తనని దారుణంగా తిట్టినట్లు పైన రూమ్ లో ఉన్న చిరంజీవికి చెప్పటం జరిగింది అంట.

ఒక్కసారిగా చిరంజీవి… చరణ్ ని రూమ్ లోకి లాక్కెళ్లి తన బెల్ట్ తీసి ఎడాపెడ వాయించేసారట. ఈ విషయం ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తెలియజేశారు. ఆ బూతులకు తనకు అర్థం కూడా తెలియదని చాలా చిన్న వయసులో.. బాబాయ్ నాగబాబుని అలాగనేసరికి నాన్న తట్టుకోలేక.. బూతులు మాట్లాడటంతో అప్పుడు తనపై చేయి చేసుకున్నట్లు చరణ్ తెలియజేయడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *