రక్షా బంధన్ సందర్భంగా చిరంజీవి చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు ఆయనకి రాఖి కట్టారు. అన్నయ్యకి ప్రేమతో భక్తి శ్రద్దలతో వీరిద్దరూ రాఖీ కట్టి చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోలని చిరు సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే అంతా బాగానే ఉంది. అయితే ఆ వీడియో చూస్తే మీకు ఓ సీక్రెట్ తెలుస్తుంది. చిరు పూజగదిలో దేవుళ్ల చిత్రపటాలతో పాటు ఓ ఇద్దరి వ్యక్తుల ఫొటోలు స్పెషల్‌గా ఉన్నాయి. ఇంతకీ ఆ ఫొటోలు ఎవరివి?
చాలామంది ఓ స్థాయికి వచ్చిన తర్వాత దానికి కారణమైన వాళ్లని మర్చిపోతుంటారు. కానీ చిరంజీవి అలా అస్సలు చేయలేదు. జన్మనిచ్చిన తండ్రి కొణిదెల వెంకట్రావుతో పాటు నటుడిగా తన ఎదుగుదలకు కారణమైన అల్లు రామలింగయ్యని అస్సలు మర్చిపోలేదు. అవును మీరు ఊహించింది కరెక్టే. వీళ్లిద్దరి ఫొటోలనే తన ఇంట్లో పూజగదిలో పెట్టుకున్నాడు. అంటే వాళ్లని దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నారు. తాజాగా రాఖీ పండగ సందర్భంగా చిరు షేర్ చేసిన ఫొటోలు, వీడియోల వల్ల ఈ విషయం బయటపడింది.
దీంతో చిరు.. తండ్రి-మామకు ఇస్తున్న గౌరవం చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యే ‘భోళా శంకర్’ సినిమాతో వచ్చిన చిరు.. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం చిరు రెండు కొత్త మూవీస్ ఒప్పుకొన్నారు. ఇందులో ఒకటి కూతురు సుస్మిత నిర్మిస్తున్న ప్రాజెక్టుతో పాటు, యంగ్ డైరెక్టర్ వశిష్ట్ తీస్తున్న మరో చిత్రం ఉంది.