‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ లో కళ్యాణి దేవి పాత్రని ఈమె పోషించిన సంగతి తెలిసిందే.ఈ సీరియల్ లో ఆమె కొంచెం కోపిష్టిలా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సీరియల్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రసారం అయిన రామయణం, మహాభారతం సీరియల్ కు జనాల నుంచి ఎంత ఆదరణ దక్కిందో ప్రస్తుతం చిన్నారి పెళ్లికూతురు సీరియల్ కు ఆ స్థాయి ఆదరణ దొరికింది. తెలుగులో ఈ సీరియల్ ఎప్పుడూ టాప్ రేటింగ్ లో కొనసాగింది. అయితే ఈ సీరియల్లో నటించిన పలువురు నటీనటులు వరుసగా చనిపోతున్నారు.
ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. హీరో, హీరోయిన్ తో పాటు బామ్మ కూడా చనిపోయింది. ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ ఏప్రిల్ 1, 2016లో ముంబైలో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.కానీ ఆమె మరణం వెనుక ఏదో బలమైన కారణం ఉందని తన తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఇప్పటికీ కోర్టుల్లో ఆ కేసుల విచారణ కొనసాగుతుంది. అటు ఈ సీరియల్ లో నటించిన బామ్మ సురేఖ 2001 జూలై 16న చనిపోయింది.
70 ఏండ్ల వయసున్న ఈ బామ్మ ఎంతో యాక్టివ్ గా ఉండేది. కానీ అనుకోకుండా ఆమె ఆరోగ్యం క్షీణించింది. కిత్స పొందుతూ కొద్ది రోజుల్లోనే తను చనిపోయింది.ఆమె కూడా ముంబైలోనే గుండెపోటుతో చనిపోయింది. తాజాగా చిన్నారి పెళ్లి కూతురు హీరో సిద్ధార్థ్ శుక్లా సైతం చనిపోయాడు.సెప్టెంబర్ 21, 2021 రాత్రి గుండెపోటుతో చనిపోయాడు. ఈ సీరియల్ లో హీరో పాత్ర పోషించిన ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.కేవలం 40 ఏండ్ల వయసులోనే తను చనిపోవడం అభిమానులకు షాక్ కలిగించింది.