గత కొన్నిరోజులుగా అపోలో హాస్పిటల్స్ లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్న ఈ కార్యక్రమంలో సురేఖతో పాటు ఉపాసన కుటుంబసభ్యులు, అపోలో వర్కర్స్, పలువురు భక్తులు కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే సురేఖ కొణిదెల తన కొడుకు బర్త్ డేని కూడా నిర్వహించారు.
పూజలో పాల్గొన్న 500 భక్తులకు రామ్ చరణ్ పేరిట.. సురేఖ అన్నదానం చేసారు.‘అత్తమ్మస్ కిచెన్’ ద్వారా ఈ అన్నదానాన్ని నిర్వహించారు. ఉపాసన సహాయంతో సురేఖ ఇటీవలే.. ఈ అత్తమ్మస్ కిచెన్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు. ఈ అన్నదానంతో చరణ్ బర్త్ డేని మాత్రమే కాదు, తమ బిజినెస్ ప్రమోషన్స్ ని కూడా నిర్వహించేసారు.
ఇక ఈ అన్నదానానికి సంబంధించిన వీడియోని అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. మరో పక్క ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్ స్పెషల్ ఈవెంట్ కూడా ఉంది. మరి ఆ ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా రాబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది.