చాణక్యుడికి కేవలం రాజకీయ, ఆర్థిక పరమైన విషయాలపైనే కాకుండా మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే చాణక్య నీతి శాస్త్రంలో ఆర్థిక పరమైన విషయాలతో పాటు రిలేషన్ షిప్ తదితర విషయాల గురించి సంపూర్ణంగా వివరించాడు. ఆచార్యు చాణక్యుడు తక్ష శిలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఈ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ఎలా నడుచుకోవాలనే వివరాలను పూర్తిగా వివరించారు. ఈ నేపథ్యంలోనే చాణక్యుడు స్నేహితులతో, సన్నిహితంగా ఉండేవారితో పొరపాటున కూడా కొన్ని విషయాలను అస్సలు చేసుకోకూడదని వివరించాడు.
అయితే చాణక్య నీతిలో స్త్రీలు, పురుషులకు సంబంధించి వేరువేరుగా నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. పురుషులు తమ విషయంలో కొన్ని విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. లేకపోతే, వారు జీవితాంతం సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. వ్యక్తిగత రహస్యాలు..పురుషులు తమ వ్యక్తిగత రహస్యాలను ఎవరి ముందు వెల్లడించకూడదు. వారు కొన్ని విషయాలను తమ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు. వ్యక్తిగత రహస్యాలను చెప్పిన పక్షంలో జీవితాంతం సమస్యలు వెంటాడుతాయి. అవమానం.. మీరు ఏ విధమైన అవమానానికి గురైన ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకండి.
మీకు ఎదురైన అవమానం గురించి ఇతరులకు చెబితే మీ ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. అందుకే మీకు ఎదురైన అవమానాల గురించి సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా చెప్పకండి. మీలోనే దాచుకోండి. భార్యతో గొడవలు.. భార్య భర్తల మధ్య గొడవలు సాధారణమే అయినప్పటికీ, ఆ విషయాలను ఇతరులకు తెలియజేయవద్దు. మీ సన్నిహితుల ముందు మీ భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విషయాలు చెప్పకండి. లేదంటే మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. గొడవలు పడే భార్య భర్తలకు సమాజంలో గౌరవం తగ్గిపోతుంది.
బలహీనతలు..ప్రతి వ్యక్తికి అతని వ్యక్తిత్వంలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మీలోని బలహీనతల గురించి ఎవరికీ చెప్పకండి. అలా కాదని ఎవరికైనా చెబితే వారు మిమ్మల్ని అనచి వేయడానికి ప్రయత్నిస్తారు. మీ బలహీనతలను ఉపయోగించుకుంటారు. మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి..మీ ఆర్థిక పరిస్థితుల గురించి ఎవరికీ చెప్పకండి. సమస్యలను అధిగమించేందుకు డబ్బు ఉపయోగపడుతుంది. మీ దగ్గర అధికంగా డబ్బు ఉంటే, అది మీ బంధువులకు తెలిసినప్పుడు, వారు దానిని దొంగిలించడానికి, లేదా మీకు హాని చేసి దానిని సొంతం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ఆచార్య చాణక్య హెచ్చరించారు.