మరో అద్భుతం సృష్టించిన ఇస్రో. విక్రమ్ ల్యాండర్లో కదలిక..?

ప్రస్తుతం చంద్రుడిపై చీకటి అలుముకుంది. మరో 10 రోజల దాకా వెలుగు రాదు. అంతకుముందు ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్, రోవర్‎లతో కనెక్ట్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఎంత ట్రై చేసినా వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం షెడ్యూల్ లో లేదు. కేవలం ప్రయోగాత్మకంగానే చేసి విజయం సాధించారు. భవిష్యత్తులో చంద్రుడిపై సేకరించే మట్టి, ఇతరత్రా శాంపిళ్లను తిరిగి భూమి మీదకు తేవడానికి అక్కడి నుంచి వ్యోమనౌక టేకాఫ్ కావడం ముఖ్యం. అందులో భాగంగా సంబంధిత ప్రయోగాన్ని విక్రమ్ ల్యాండర్ తో చేశారు. చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. వీరముత్తవేల్ ఈ విషయంపై మాట్లాడుతూ..

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై తమ 14 రోజుల పరిశోధన, అన్వేషణలో చాలా క్లిష్టమైన డేటాను అందించాయని తెలిపారు. తాజా ప్రయోగం సమయంలో విక్రమ్ ల్యాండర్ ఇంజిన్ లో మండించడం ద్వారా, ఊహించిన విధంగా దాదాపు 40 సెంటీమీటర్ల వరకు కదిలించగలిగినట్లు చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతంతో చంద్రుని ఉపరితలం నుంచి భారతదేశానికి నమూనాలను తిరిగి ఇవ్వగలిగేలా భవిష్యత్తు మిషన్ ను అభివృద్ధి చేయవచ్చునిన వీరముత్తవేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ఆగస్టు 23న ల్యాండర్ విక్రమ్ సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఆ తరువాత ల్యాండర్, రోవర్ చంద్రుని ఉపరితలంపై అనేక ప్రయోగాలు చేశాయి. 14 రోజుల పాటు ఈ ప్రయోగం కొనసాగింది. ఆ తరువాత చంద్రుడిపై రాత్రి ప్రారంభమై శివశక్తి పాయింట్ పై సూర్యక్రాంతి తగ్గుముఖం పట్టింది. దీంతో సెప్టెంబర్ 2న రోవర్ ను, సెప్టెంబర్ 4న ల్యాండర్ ను శాస్త్రవేత్తలు నిద్రాణ స్థితిలోకి పంపారు. చంద్రమామపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్ 120 – 200 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోవటం, అంతటి శీతల పరిస్థితుల్లో అవి పనిచేసే అవకాశం లేకపోవడంతో వాటిని నిద్రావస్థలోకి పంపించారు. అయితే, సెప్టెంబర్ 22న చంద్రుడిపై రాత్రి (లూనార్ నైట్) పూర్తయింది. ల్యాండర్, రోవర్ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది.

ఈ నేపథ్యంలో వాటితో కమ్యూనికేషన్ ను పునరుద్ధరించేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది. ఇస్రో ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఎంతకీ ల్యాండర్, ప్రజ్ఞారోవర్ లు నిద్రావస్థనుంచి మేల్కొనకపోవటంతో ఇక చంద్రయాన్ 3 ప్రయోగం ఇంతటితో ఆగిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా ప్రయోగంతో విక్రమ్ ల్యాండర్లో కదలిక వచ్చింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంలో పూర్తిగా చిమ్మచీకటి, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే 14 రోజుల చంద్ర రాత్రి (లూనార్ నైట్ ) నుంచి మేలుకొని మళ్లీ కీలక ప్రయోగాలకు విక్రమ్ ల్యాండర్ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *