ఎన్నో సినిమాలలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించినటువంటి చంద్రమోహన్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పై పడటంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి చంద్రమోహన్ గారు ఉదయం అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే
చంద్రమోహన్ భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఈమె ఓ సైకాలజిస్టుగా పని చేస్తున్నారు. అలాగే చిన్న కుమార్తె మాధవి చెన్నైలో సెటిల్ అయ్యారు. పెద్ద కూతురు మధుర మీనాక్షి మాత్రం ప్రస్తుతం ఈమె అమెరికాలో ఉంటున్నారు.
అయితే ఆవిడ తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి రెండు రోజులు ఆలస్యంగా ఈయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.