చంద్రమోహన్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 11న ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. అనారోగ్య సమస్యలతో చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు చంద్రమోహన్.
అయితే 1966లో రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు.
సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రారంభంలో చంద్రమోహన్‌తో నటించి, తరువాత ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడుగా గుర్తింపు పొందారు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు.