ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

సిని ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని దశాబ్దాలు పాటు కోన సాగిన చంద్రమోహన్ ఇప్పటికి తనకు అవకాశాలు ఇచ్చే దర్శికులు కోసం ఎదురు చూస్తుంటారట. రియల్ లైఫ్ లో చంద్రమోహన్కు ఇద్దరు కూతుర్లు. సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్.. ఆ తర్వాత భూములపై పెట్టునడులు పెట్టారని.. ఇప్పుడు వాటి విలువ వందల కోట్లు ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు.

అయితే చంద్ర మోహన్ ..ఎంతోమంది హీరోయిన్స్ కు మొదటి హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు..అతిలోక సుందరి శ్రీదేవి మొదట హీరోయిన్ గా నటించిన 16 ఏళ్ల వయసు సినిమా హీరో కూడా ఇతడే..1966 లో రంగుల రాట్నం సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్.. అప్పట్లో హీరోయిన్స్ పాలిట గోల్డెన్ హ్యాండ్ గా చెప్పేవారు…ఈయన పక్కన హీరోయిన్ గా నటిస్తే.. స్టార్ హీరోయిన్ అవుతారనే నమ్మకం పెట్టుకునేవారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన చంద్రమోహన్..ఎన్నో పాత్రల్లో నటించాడు.

తన నటనతో ఎన్నో అవార్డ్స్ అందున్నాడు.. ఆలా సినిమాల ద్వారా సంపాదించిన సొమ్మును భూముల రూపంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది..ఇప్పుడు ఆ భూముల ధరలు వందల కోట్లలో ఉన్నాయట. చెన్నై లో పలు కాంప్లెక్స్ లతో పాటు హైదారాబాద్ నగర శివార్లలో కూడా చంద్రమోహన్ కు భారీగా ఆస్తులు ఉన్నాయనే వార్త బయటకు వచ్చింది. వీటన్నిటి విలువ 300 వందల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *