యేవమ్ మూవీలో చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది. సైకో కిల్లర్‌ను పట్టుకునే లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది. మ్యూజిక్ షాప్ మూర్తి మూవీలో ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు తోడ్పాటు అందించే యువతిగా చాందిని చౌదరి నటిస్తోంది. అయితే తెలుగు అమ్మాయిగా కనపడకూడదని ఆమె కష్టపడడానికి కారణం..
అదే ఫిగర్ తో పక్క రాష్ట్రం నుంచి వచ్చానంటే.. వెంటనే అవకాశం ఇస్తారు. అదే తెలుగు అమ్మాయి అని అంటే.. చూద్దాంలే.. చేద్దాంలే అని తిప్పించుకుంటారు. ఆ తర్వాత మెల్లగా సైడ్ చేసేస్తారు. ఇదంతా అందరికి తెలిసినా విషయమే. అయినా సరే.. ఈ పరిస్థితులను ఎదుర్కొని.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని.. నటిగా తనని తానూ నిరూపించుకుంటుంది.
తెలుగు నటి చాందిని చౌదరి. దాదాపు 15 ఏళ్లుగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ భామ యేవమ్ , మ్యూజిక్ షాప్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాలు జూన్ 14న థియేటర్స్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. యేవమ్ సినిమాలో ఈ అమ్మడు.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అలరించబోతుంది.