శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య సన్నిహితంగా ఉంటున్నారని.. వారిద్దరూ తరచుగా వెకేషన్స్‌కి వెళుతున్నారనే టాక్ అయితే నడిచింది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడని, శోభితను వివాహం చేసుకోవాలని చైతూ ఫిక్సయినట్లు ఓ రేంజ్ డిస్కషన్స్ నడిచాయి. ఆ తర్వాత ‘లాల్ సింగ్ చద్దా’ ప్రమోషన్స్‌లో ఇదే విషయాన్ని నాగ చైతన్య వద్ద ప్రస్తావిస్తే.. తనకు నవ్వొస్తుందని అన్నారు. ఈ రూమర్ ని సున్నితంగా ఖండించారు.
అయితే ఏం మాయ చేశావే సినిమాతో ఇద్దరు ప్రేమలో పడ్దారు.. సీక్రేట్ గా ప్రేమించుకున్నాడు.. 2017 లో పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. మూడు ముళ్ళ బంధానికి మూడే మూడేళ్లు కాపురం చేసిన ఈజంట.. మనస్సర్ధలతో వారి బంధాన్ని ముగించేశారు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీపుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట.. లోపల గొడవలు కనిపించకుండా దాచారు. వీడాకులతో ఫ్యాన్స్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక వీరి విడాకులు తరువాత కెరీర్ లో విడివిడిగా బిజీ అయిపోయారు. ఇక ఈక్రమంలో నాగచైతన్యకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగచైతన్యకు త్వరలో పెళ్లి చేయాలని చూస్తున్నాడట నాగార్జున. ఇప్పటికే చైతూకు జోడీ అయిన మంచి అమ్మాయిని కూడా సెలక్ట్ చేశాడట నాగ్. ఆ అమ్మాయి ఎవరో కాదు.. నాగార్జున బంధువుల అమ్మాయేనట. బంధువులలో మంచి అమ్మాయిని సెలక్ట్ చేశారట నాగ్. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అటు చైతూ కూడా మీ ఇష్టం అని. నిర్ణయాన్ని తండ్రికి వదిలేసినట్టు తెలుస్తోంది. దాంతో అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతున్నట్టు తెలుస్తోంది.