కేంద్ర నిధులతో పేదలకు అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం అవసరమని, మరే ఇతర సేవలకూ ఆధార్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశం తేల్చింది.ఇక ఆధార్ లోని వివరాలను ట్యాంపర్ చేసినా, ఎవరికైనా విక్రయించినా మరింత కఠిన శిక్షలు పడేలా చూడాలని, ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలు రూపొందించాలని న్యాయశాఖకు సూచించింది. అయితే 18 ఏళ్లు నిండి తొలిసారి ఆధార్ కార్డ్ ను తీసుకునే వాళ్లు ఫిజికల్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థను యూఐడీఏఐ సిద్ధం చేస్తోంది. నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను ఇందుకోసం కేంద్రం నియమించనుందని సమాచారం అందుతోంది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తైన తర్వాత 180 రోజుల్లో ఆధార్ ను జారీ చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డు జారీ అయిన తర్వాత సాధారణ పద్ధతుల ద్వారా వివరాలను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తొలిసారి ఆధార్ కార్డ్ తీసుకోవాలని భావించే వాళ్లు మాత్రమే ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మిస్ చేసుకుంటే ఆన్ లైన్ ద్వారా కొత్తది తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే కొన్ని పథకాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. మన దేశానికి చెందిన పౌరులు మాత్రమే ఆధార్ కార్డ్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను పొందాలన్నా ఆధార్ కార్డ్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.