దిగ్గజ సంగీత దర్శకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) అనారోగ్య కారణాలతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ప్రోస్టేట్ క్యాన్సర్ తో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన కోల్ కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఉస్తాద్ రషీద్‌ఖాన్ కన్నుమూశారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడిన ఆయన కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రషీద్‌ఖాన్ తుదిశ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రవీంద్ర సదన్‌లో ఉంచారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రషీద్‌ఖాన్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. సంగీత రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది. ‘ఇష్కేరియా, మౌసమ్, హేట్ స్టోరీ 2, రాజ్, షాదీ మైన్, ఆవోగే జబ్‌తుమ్, కర్లే ప్యార్ కర్లే’ తదితర చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.