గద్దర్ నుండి దిల్ రాజు తండ్రి వరకు ఎంతో మంది ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. కొందరు వయసు సంబంధిత సమస్యలతో, మరికొందరు అనారోగ్య సమస్యలతో, కొంతమంది గుండెపోటుతో, మరికొంత మంది రోడ్డు ప్రమాదాల్లో.. అవీ కాదు అంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వంటి వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి భైరవి వైద్య (67) కన్నుమూశారు. పలు హిందీ సీరియల్స్, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది.
అయితే పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 8న భైరవి కన్నుమూసినట్లు ఆమె కూతురు జానకి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘అమ్మ నాకు నువ్వే సర్వస్వం. మీరు మీ పిల్లలను పెంచడంతో పాటు వారి వారి కలలను సాకారం చేసుకునేలా తోడ్పడ్డారు. సినిమా, టీవీ, ఓటీటీ.. ఇలా అన్ని రంగాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆమె తన కుటుంబం కోసం ఎంతో ధార పోసింది. చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంది. ఈ జన్మలో నిన్ను నా తల్లిగా పొందడం నా ఆశీర్వాదం అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది.

అదే సమయంలో ఇక నువ్వు మా మధ్యన లేవు అని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాను. అమ్మా.. నేను మీ బిడ్డలం అని గర్వంగా చెప్పుకునేలా మేం ఎదుగుతామని ప్రమాణం చేస్తున్నాను. మిస్ యూ అమ్మా’ అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది జానకి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భైరవి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.