న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, షెరికా డి అర్మాస్ గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయి అక్టోబర్ 13న 26 ఏళ్ల వయసులో మరణించారు. డి అర్మాస్ కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్స చేయించుకున్నారు. షెరికా డి అర్మాస్ మరణ వార్త ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే మాజీ మిస్ వరల్డ్ పోటీదారు కన్నుమూశారు. 26 ఏళ్లకే ఆమె మృత్యువాత పడడం అందరినీ కలిచివేసింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తీవ్రమైన అనారోగ్యానికి గురై పరిస్థితి విషమించడంతో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఆమె మరెవరో కాదు ఉరుగ్వేకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారు, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్. ఈమె గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటున్నప్పటకీ వ్యాధి నయం కాకపోవడంతో కన్నుమూసినట్లు ఆమె సోదరుడు తెలిపాడు. ఈ నెల 13న ఆమె తుదిశ్వాస విడిచినట్లు సోదరుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వే తరఫున షెరికా డి అర్మాస్ పాల్గొన్నది.
కానీ ఆ పోటీల్లో టాప్ 30లో స్థానం దక్కించుకోలేకపోయింది. కాగా బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా, క్యాట్‌వాక్ మోడల్ అయినా తాను ఎప్పుడూ మోడల్‌గా ఉండాలని కోరుకుంటున్నానని అర్మాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆమె ఒకానొక దశలో గర్భాశయ క్యాన్సర్ భారిన పడింది. ఈ క్రమంలో కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు ఈ మహమ్మారితో పోరాడి ఓడింది. షెరికా డి అర్మాస్ అకాల మరణంతో ప్రపంచ వ్యాప్తంగా దిగ్బ్రాంతికి లోనయ్యారు.