అల్లు అర్జున్ భార్యని ఇలా ఎప్పుడూ చూసుండరు, అభిమానులకు ముందుగా..?

బన్నీ ఎంతో ఫేమస్సో .. ఆయన వైఫ్ స్నేహ కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది. స్నేహా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో అల్లు అర్జున్ సూట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఆ పోస్టుకి ‘లండన్’ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక ఈ పిక్ చూసిన అభిమానుల్లో.. బన్నీ లండన్ ఎందుకు వెళ్లాడని సందేహం మొదలైంది.

కాగా అల్లు అర్జున్ లండన్ వెళ్ళింది తన భార్య స్నేహ రెడ్డి బర్త్ డేని సెలబ్రేట్ చేయడం కోసమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నేడు స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆమెకు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు. ఇక నిన్న అల్లు అర్జున్ లండన్ నుంచి ఫోటో షేర్ చేయడం, నేడు స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో.. తన వైఫ్ బర్త్ డేని సెలబ్రేట్ చేయడానికే అల్లు అర్జున్ లండన్ వెళ్లి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఏమో మరో కారణం కూడా చెబుతున్నారు.


ఇటీవల లండన్‌లోని ప్రఖ్యాతి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడం కోసమే అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి ఉంటాడని మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలతో సిద్దమవుతుంది. డైరెక్టర్ సుకుమార్ సెకండ్ పార్ట్ ని మొదటి భాగాన్ని మించి ఉండేలా చిత్రీకరిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *