నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..! పోటీ అక్కడ్నుంచేనా..?

రాజమండ్రిలో టీడీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన రోజు నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. సూటిగా , స్పష్టంగా ఎక్కడా తడబాటు లేకుండా ఆమె మీడియాకు ఇచ్చిన సమాధానాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో రాణించే సామర్థ్యం ఉందన… భయపడే తత్వం కూడా కాదని అందరూ అంచనాకు వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించినా అవేమీ జరగలేదు. తనకు రాజకీయాలు, సినిమాలు అంటే అస్సలు ఇష్టముండదని.. అంతా బిజినెస్ వైపేనని కూడా ఆమె క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పుడు ఎన్నికల దగ్గరపడుతుండగా.. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంత కాలంగా ప్రత్యక్షంగా కాకపోయినా రాజకీయాలను మాత్రం బ్రాహ్మణి నిశితంగానే పరిశీలిస్తున్నారట. అసలు విజయవాడ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందని స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి మరి ఎప్పుటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారట బ్రాహ్మణి. మరోవైపు చంద్రబాబు కూడా.. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బ్రాహ్మణిని పోటీచేయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేదానిపై ఓ సర్వే కూడా చేయించి నివేదికలు కూడా తెప్పించుకున్నారని సమాచారం.

చంద్రబాబుకు, కేశినేని నానికి చాలా గ్యాప్ రావడానికి కూడా బ్రాహ్మణి విషయం బయటికి పొక్కడమేనని నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తానికి చూస్తే.. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే మాత్రం టీడీపీకి మరింత ఊపు వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారో.. లేదో.. అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియట్లేదు కానీ.. నారా వారి ఇంట మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశ చేయబోతున్నారంటూ రూమర్స్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అయితే.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *