కమెడియన్లకు.. ఇతర నటులకంటే.. ఎక్కువ సంపాదన ఉండదని సినీ పరిశ్రమలో ఓ టాక్ ఉంది. చాలా మంది ఇదే విషయాన్ని నమ్ముతారు. అయితే కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్, ఇలా చాలమంది కమెడియన్లకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. మిగతవాళ్లు బ్రహ్మానందం అంత రిచ్‌గా లేరు.
అవును బ్రహ్మానందం సంపద గురించి విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది స్టార్ హీరోలను కూడా అధిగమించాడు బ్రహ్మి. ప్రస్తుతం బ్రహ్మానందం వయసు 67 ఏళ్లు. అయినా యాక్టివ్ గా ఉంటాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. సినిమా రంగానికి ఆయన చేసిన సహకారం మాటల్లో చెప్పలేనిది.
2009లో బ్రహ్మానందానికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఒక్కో సినిమాకు ఒకటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. అంతకుముందు రోజుకు రెండు లక్షల నుంచి నాలుగు వరకూ తీసుకునేవాడని చెబుతారు. బ్రహ్మానందం మొత్తం ఆస్తులు 490 కోట్ల రూపాయలు ఉందని టాక్.
బాగా బిజీగా ఉన్న సమయంలో ప్రతి నెలా 2 కోట్ల రూపాయల వరకూ అందుకునేవాడు. కపిల్ శర్మ కంటే బ్రహ్మానందం ఎక్కువ పారితోషికం తీసుకుంటాడు. బ్రాండ్‌లను ప్రమోట్ చేసినందుకు అతనికి కోటి రూపాయలు అందుతాయి.