బనితా సంధు..బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఆమె నటించిన పలు సినిమాలు హిట్ అందుకున్నాయి. సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్‌లలో ఆమె నటించారు. ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే బనితా సంధు ఏపీ ధిల్లాన్‌తో డేటింగ్ లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాన్ని బనితా సంధు..ఏపీ ధిల్లాన్‌తో తన సంబంధాన్ని ధృవీకరించారు. బనితా సంధు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏపీ ధిల్లాన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
ఇందులో ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఫోటోల్లో ఇద్దరి కెమిస్ట్రీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఒక ఫోటోలో, బనితా సంధు, ధిల్లాన్ వైపు తల వంచి మంచం మీద కూర్చొని ఉంది. మరొక చిత్రంలో ఏపీ ధిల్లాన్ బనితా దుస్తుల జిప్‌ను పెడుతున్నట్లు కనిపిస్తాడు. అయినప్పటికీ అతను ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించాడు. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నాడు. ఏపీ ధిల్లాన్ ఈ వారం ప్రారంభంలో తన సిరీస్ ‘ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్’ కోసం ఒక ఈవెంట్‌ను నిర్వహించాడు. దీనికి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి తారలు హాజరయ్యారు. అయితే చాలా మంది దృష్టిని ఆకర్షించింది అతని స్నేహితురాలు బనితా సంధు, ఆమె చాలా అందంగా ఉంది.
ఎరుపు రంగు దుస్తులలో అందంగా కనిపించింది. ఇండో-కెనడియన్ గాయకుడు ఏపీ ధిల్లాన్, నటి బనితా సంధు డేటింగ్ చేసుకుంటున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. తాజా ఫోటోలు చూస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తుంది. ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లి, నటి ధిల్లాన్‌తో రొమాంటిక్ ఫోటోలను పంచుకున్నారు. దీంతో అది చూసిన నెటిజెన్స్ మీరు చేసే పనులు ఏవో మంచి పనులు అన్నట్టు ఇలాంటి దరిద్రాలన్నీ ఫోటో తీసుకోవడం అంత అవసరమా..అంటూ ఇలాంటి పనులు చేస్తూ మళ్లీ వాటిని షేర్ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.