భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ నటుడు బ్రిజేష్ త్రిపాఠి ముంబైలో కన్నుమూశారు. నటుడి మరణానికి కారణం గుండెపోటు అని చెబుతున్నారు. ఆయన వయసు 72 యేళ్లు. బ్రిజేష్ త్రిపాఠి ఆయన మరణ వార్త వెలువడిన వెంటనే, బాలీవుడ్ మరియు భోజ్‌పురి పరిశ్రమలో శోక సంద్రంలో మునిగిపోయింది. రవి కిషన్, సంజయ్ భూషణ్ పాటియాలా బ్రిజేష్ త్రిపాఠి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అయితే భోజ్‌పురి చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు బ్రిజేష్ త్రిపాఠి కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయనకు, ముంబైలోని తన నివాసంలో నిన్న రాత్రి సడెన్ గా గుండెపోటు వచ్చింది. బ్రిజేష్ త్రిపాఠిను హుటాహుటీన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఐతే, అక్కడ బ్రిజేష్ త్రిపాఠి చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు ధృవవీకరించారు. దీంతో భోజ్‌పురి చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. బ్రిజేష్ త్రిపాఠి 1979లో సాయా తోహరే కరణ్ అనే సినిమాతో అరంగేట్రం చేసి, తనకంటూ ఓ మంచి పేరును సంపాదించుకున్నారు.

బ్రిజేష్ త్రిపాఠి మృతి పట్ల భోజ్‌పురి పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రిజేష్ త్రిపాఠి గొప్ప విలక్షణ నటుడే కాదు, మంచి మనిషి కూడా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని అక్కడి సినీ అభిమానులు వేడుకుంటున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున బ్రిజేష్ త్రిపాఠి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.