బొప్పాయి గురించి ఈ నిజాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.

తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. అయితే గుండె ఆరోగ్యం..బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది.

ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ మిమ్మల్ని గుండె జబ్బులకు గురి చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, ప్రీడయాబెటిక్స్, కాలేయ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆక్సిడైజ్డ్ కొలస్ట్రాల్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి బొప్పాయి తింటే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గుతుంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఇది అల్జీమర్స్ వ్యాధితో పోరాడడంలో కూడా సహాయం చేస్తుంది. అంతేకాకుండా శరీరం నుంచి అదనపు ఐరన్ తొలగించడంలో సహాయం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..బొప్పాయిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవి మెదడులోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి.

తద్వార ఇది క్యాన్సర్‌ను నివారిస్తుంది. క్యాన్సర్ రోగుల చికిత్సలో కూడా బొప్పాయి ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఈ పండులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయం చేస్తుంది. బొప్పాయిలో ఒక రకమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సాధారణంగా తినే ఇతర పండ్లలో లభించదు. ఇది రొమ్ము క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. ఎముకల ఆరోగ్యానికై..విటమిన్ కె తక్కువగా ఉన్న వ్యక్తులు ఎముక పగుళ్లతో బాధపడే అవకాశం ఉంది. అయితే తరచూ బొప్పాయి తీసుకుంటే.. శరీరంలోని ఎముకలు బలోపేతం అవుతాయి. అంతేకాకుండా వాటిని పునర్నిర్మించడానికి బొప్పాయి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *