కొబ్బరి నూనె లో ఇది కలపండి చాలు. తెల్లజుట్టుని శాశ్వతంగా నల్లగా మారుతుంది.

కారణం ఏదైనా తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు.అయితే ఎక్కువ శాతం మంది మార్కెట్లో లభ్యమయ్యే కలర్స్ పై ఆధారపడుతుంటారు. హెన్నా అయితే పెట్టుకున్న కొన్నిరోజుల్లోపే రంగు వెలసిపోయి తెల్లజుట్టు బయటపడుతుంది. పదే పదే ఈ ప్రాసెస్ చెయ్యాలంటే చాలామందికి చిరాకు వస్తుంది. ఈ గోల ఏదీ లేకుండా జుట్టు పూర్తీ నలుపురంగులోకి మారిపోతే ఎంత బాగుంటుందో కదా.. అందుకోసమే ఈ చిట్కాలు. కేవలం రెండే రెండు పదార్థాలు కొబ్బరినూనెతో కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు తుమ్మెద రెక్కల్లా నల్లగా మారిపోతుంది.

రోజ్ మేరీ..జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా పెరగడంలో రోజ్మేరీ చాలాబాగా పనిచేస్తుంది. సాధారణ కొబ్బరినూనెలో కొన్ని చుక్కల రోజ్మేరీ ఎస్సెంటియల్ ఆయిల్ కలిపి దాన్ని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎండిన రోజ్మేరీ ఆకులను కొబ్బరినూనెలో వేసి, మరీ ఎక్కువగా కాకుండా నూనెను కాస్త వెచ్చజేయాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి రెండు నుండి మూడు గంటల ఉంచుకుని ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తొందరగా జుట్టు నలుపురంగులోకి మారుతుంది.

జుట్టు మందంగా ఒత్తుగా పెరుగుతుంది. ఉసిరికాయ..తెల్లజుట్టు నివారణకు కొబ్బరినూనెతో ఉపయోగించాల్సిన మరొక పదార్థం ఉసిరికాయ. ఉసిరికాయలు సహజంగా చర్మానికి, జుట్టుకు అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తాయి. కొబ్బరినూనెలో ఉసిరిపొడిని వేసి పేస్ట్ లాగా మిక్స్ చెయ్యాలి. ఈ పేస్టును జుట్టుకు అప్లై చెయ్యాలి. ముఖ్యంగా జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలి. ఓ రెండు గంటలాగి తల స్నానం చెయ్యాలి. ఈ రెండు చిట్కాలలో ఏదో ఒకటి ఫాలో అయినా సరిపోతుంది. క్రమం తప్పకుండా ఇవి ఫాలో అయితే తెల్లబడిన జుట్టు తప్పకుండా నలుపు రంగులోకి మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *