కేవలం ఇది రాసుకుంటే చాలు మీముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మాయం.

బ్లాక్‌ హెడ్స్‌.. ఇటీవల చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందంగా ఉండే ముహం బ్లాక్‌ హెడ్స్‌ కారణంగా అందంకోల్పోతుంది. అయితే బ్లాక్‌ హెడ్స్‌ ప్రతీ ఒక్కరికీ వచ్చే సర్వసాధారణమైన సమస్యే. అయితే వీటిని తొలగించడం పెద్ద కష్టమేమి కాదు. సహజ పద్ధతుల్లోనే బ్లాక్‌ హెడ్స్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ బ్లాక్‌ హెడ్స్‌ సమస్య ఎందుకు వస్తుంది.? ఈ సమస్యకు సహజంగా ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చర్మానికి ఎక్కువగా ఎండ తగలగడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ సమస్య వస్తుంది. చ‌ర్మంలోని మొల‌నోసైట్స్ ఎండ కార‌ణంగా ఎక్కువ‌గా స్టిమ్యులేట్ కావడం వల్లే బ్లాక్‌ హెడ్స్‌ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌ హెడ్స్‌ సమస్య బారిన పడకూడదంటే వీలైనంత వరకు ఎండలో తిరగకూడదు. ఒకవేళ ఎండలో బయటకు వస్తే.. ఎండ తగలకుండా క్యాప్‌ను వేసుకోవాలి. బ్లాక్‌ హెడ్స్‌ ఎక్కువగా వేసవిలోనే వచ్చే అవకాశం ఉంటుంది.

కాబట్టి సమ్మర్‌లో బయటకు వెళ్తే ముక్కుపై కాస్త కొబ్బ‌రి నూనెను రాసుకుని వెళ్లాలి. దీనివల్ల ఎండ నుంచి చర్మం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. ఇక వచ్చిన బ్లాక్‌ హెడ్స్‌ను తొలగించడంలో తేనె ఉపయోగపడుతుంది. రోజూ తేనెతో బ్లాక్‌ హెడ్స్‌ ఉన్న చోట మ‌ర్ద‌నా చేసుకోవడం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బ్లాక్‌ హెడ్స్‌ సమస్య తగ్గాలంటే ముహానికి ముల్తానీ మట్టి అప్లై చేసుకోవొచ్చు. ఇలా చేస్తే బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.

మడ్‌ ప్యాక్‌ వేసుకోవడం ద్వారా కూడా బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి. దీనికి కారణం.. ఆ భాగాల‌కు ఆక్సిజ‌న్, నీరు, పోష‌కాలు చ‌క్క‌గ అందడమే. బ్లాక్‌ హెడ్స్‌ సమస్యతో బాధపడేవారు నీటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. దీంతో ముక్కుపై వ‌చ్చే న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, బ్లాక్ హెడ్స్, బ్లాక్ స్పాట్స్ వంటివి త‌గ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *