బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్, ఒకేసారి ఇంటి నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఔట్.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ఐదుగురిని ఇంట్లోకి పంపించారు. దీంతో బిగ్ బాస్ 2.0 రసవత్తరంగా మారింది. ఉల్టా పుల్టా అని నాగ్ మెుదటి నుంచి చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే తాజా వీకెండ్ ఎపిసోడ్ ఉంది. అయితే ప్రేక్షకుల్లో అత్యధిక ఆదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట హాలీవుడ్ లో మొదలు అయింది. అక్కడ ఈ షోకు మంచి ఆదరణ రావడంతో.. మన ఇండియాలోనూ మొదలు అయింది.

అలా మొదట హిందీలో ప్రారంభం అయిన ఈ షో… తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలకు చేరింది. ఒక్కో భాషల్లో ఒక్కో హీరో హోస్టుగా నిర్వహిస్తున్నాడు. ఇక సక్సెస్ ఫుల్ గా ఈ షో సాగుతోంది. ఇక హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.. హౌస్టుగా సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. అక్కడ 17వ సీజన్ నడుస్తుంది. 17 సీజన్స్ అంటే మామూలు విషయం కాదు.. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్‌ కు అక్కడి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయాడు. ఈ వారంలో ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్స్‌ ను ఎలిమినేట్ చేయనున్నట్లు సమచారం.

ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా.. ఐదు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. అయితే గత రెండు వారాలుగా ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్ బాస్.. ఈ సారి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓకే సారి ఐదు మంది కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయాలని చూస్తున్నాడు. అంతే కాదు.. మరో ఐదుగురి కొత్త వారిని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంటిలోకి పంపించనున్నట్లు అర్థం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *