ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్‌బాస్ మీద కూడా అరిచేశాడు. అయితే గేమ్‌లో ఆడా మగా.. అనే తేడా లేదనే నాగ్ వ్యాఖ్యలు..! అమ్మాయిలు అబ్బాయిలు కలిసే గేమ్ ఆడాలనే బిగ్ బాస్ మాటలు..! గెలుపు కోసం ఇమ్యూనిటీ కోసం.. హౌస్ సభ్యులు చేస్తున్న చీటింగ్లు! వెరసి బిగ్ బాస్ గొడవలకు కేరాఫ్‌గా మారుతోంది.
చిలి చిలికి గాలి వానలా మరుతూ.. అది బిగ్ బాస్ పైనే విమర్శలకు కారణం అవుతోంది. ఇక తాజా ఎపిసోడ్‌లో.. శోభ వర్సెస్ ప్రిన్స్ యావర్ మధ్య జరిగిన గొడవ కొత్త చర్చకు దారితీసింది. కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కాపురంలో నిప్పులు పోసే విలన్‌లా చేసిన మోనితా అలియాస్ శోభ..! బిగ్ బాస్ సీజన్‌కు ఎంటర్ అయినప్పటి నుంచి అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. తన నేచర్‌తో.. తన యాటిట్యూడ్‌తో.. అటు గేమ్‌లోనూ…ఇటు బయట మంచి మార్కులు సంపాదించుకున్నారు. కానీ తాజా ఎపిసోడ్‌లో తనది కానీ వస్తువును.. మరో టీం నుంచి లాక్కోవడం.. తిరిగి ఇవ్వకపోగా… ప్రిన్స్ యావర్..ఆ వస్తువును దాచిన చోటైన.
తన ప్రైవేట్ ప్లేస్‌లో చేయి పెట్టారని ఆరోపించడంతో.. ఇప్పుడు భారీగా నెగెటివిటీని మూటగట్టుకున్నారు. అయితే శోభకు ఏమాత్రం తీసిపోని విధంగా.. తన వస్తువు కోసం అమ్మాయితో.. బాహాబాహీకి దిగాడు. అమ్మాయని చూడకుండా.. లాగి కిందపడేసి.. మరీ బలవంతంగా… టాస్క్‌లో సంపాదించుకున్న తన వస్తువును తాను తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మిగిలిన కంటెస్టెంట్స్ అడ్డుకుంటే.. నాగ్ సర్ చెప్పారు గేమ్‌లో ఆడా మగా తేడా ఉండదంటూ.. వాదించాడు. ఈ సీన్తో తను కూడా విమర్శల పాలవుతున్నారు.
అయితే శోభ, ప్రిన్స్ యావర్‌తో పాటు.. బిగ్ బాస్ ఆట తీరుపై, నాగ్ వ్యాఖ్యలపై కూడా ఫైర్ అవుతున్నారు బీబీ ఆడియెన్స్ అండ్ నెటిజెన్స్. వీరి స్టేట్మెంట్స్‌తో.. గేమ్ థీమ్‌తో.. హౌస్‌లో ఆడాళ్లు మగాళ్లు కొట్టుకుంటూ పోతున్నారని.. ఆ తర్వాత అసభ్యకరంగా తిట్టుకుంటున్నారని.. దీని వల్ల సభ్యసమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని వారంటున్నారు. కానీ కొంత మంది చేస్తున్న ఇలాంటి కామెంట్స్ పక్కన పెడితే.. గేమ్‌ను గేమ్ పరంగా చూడాలనేది బీబీ లవర్స్ మాట.